TG: ఈ నెల 25న ఉదయం 11 గంటలకు రాష్ట్ర కేబినెట్ సమావేశం కానుంది. ఈ సమావేశంలో కీలకమైన బీసీల రిజర్వేషన్ల అంశం ప్రధాన అజెండాగా ఉండనుంది. కేబినెట్ డెడికేషన్ కమిషన్ నివేదికను ఈ నెల 25న జరిగే భేటీలో ప్రవేశపెట్టనున్నారు. ఈ భేటీలోనే సర్పంచ్ ఎన్నికలపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.