KNR: టీఎంపీఎస్ ప్రధాన కార్యదర్శి కీసర సంపత్ ముదిరాజ్ ఆధ్వర్యంలో శంకరపట్నం తాడికల్ గ్రామంలో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ జెండాను శుక్రవారం ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు రాణవేణి మల్లయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టీఎంపీఎస్ ఆధ్వర్యంలో సంఘం సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.