KRNL: రాష్ట్ర మంత్రి లోకేష్‌ను ఆయన నివాసంలో ఆలూరు టీడీపీ ఇంఛార్జ్ వైకుంఠం జ్యోతి శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రిని శాలువాతో సన్మానించారు. అనంతరం ఆలూరు నియోజకవర్గం అభివృద్ధి గురించి వారితో చర్చించారు. ఆలూరు పార్టీ బలోపేతం కోసం చేయాల్సిన అంశాలను చర్చించారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధులను మంజూరు చేయాలని కోరినట్లు చెప్పారు.