TG: ఐబొమ్మ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును దర్యాప్తు చేసేందుకు ఈడీ రంగంలోకి దిగింది. కేసు వివరాలు ఇవ్వాలని హైదరాబాద్ సీపీకి లేఖ రాసింది. ఐబొమ్మ వ్యవహారంలో మనీలాండరింగ్ జరిగినట్లు ఈడీ అనుమానం వ్యక్తం చేసింది. ఈ కేసులో నిందితుడు రవి ఖాతాల నుంచి రూ.3.5 కోట్లు ఫ్రీజ్ చేసిన విషయం తెలిసిందే.