CTR: విద్యుత్ సమస్యల పరిష్కారానికి బుధవారం ఐరాల మండలం పైపల్లె సబ్-డివిజన్ కార్యాలయ ఆవరణలో ప్రత్యేక విద్యుత్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు చిత్తూరు అర్బన్ ఈఈ మునిచంద్ర తెలిపారు. చిత్తూరు టౌన్, బంగారుపాళ్యం, రెడ్డిగుంట, పైపల్లె సబ్-డివిజన్ల సెక్షన్ల పరిధిలోని వినియోగదారులు తమ సమస్యలపై వినతి పత్రాలు అందించవచ్చన్నారు.