శబరిమల అయ్యప్ప దర్శనానికి స్వాములు పొటెత్తారు. సోమవారం రికార్డు స్థాయిలో 1.25 లక్షల మంది భక్తులు ఆ హరిహరపుత్రుడిని దర్శించుకున్నారు. స్వామలు రద్దీ నేపథ్యంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. బుధవారం నుంచి 20 వేల స్పాట్ బుకింగ్లకు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అదనంగా వచ్చే భక్తులకు తర్వాతి రోజు స్లాట్లను కేటాయిస్తామని వెల్లడించారు.