ప్రకాశం: పాడి రైతులు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ దాణాను ఉపయోగించుకోవాలని జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి కోరారు. తాళ్లురులోని పశువైద్యశాల ఆవరణలో మంగళవారం పాడి రైతులకు సబ్సిడీపై అందిస్తున్న పశువుల దాణాను పంపిణీ చేశారు. మండలంలో 5 టన్నుల పశువుల దాణా అందుబాటులో ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పశు వైద్యాధికారులు, నాయకులు పాల్గొన్నారు.