WNP: దేశ అభివృద్ధిలో భాగ్య స్వాములు కావలసిన యువత మాదక ద్రవ్యాల బారీన పడి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ పిలుపునిచ్చారు. మిషన్ పరివర్తన కార్యక్రమంలో భాగంగా వనపర్తి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. దేశం అభివృద్ధి సాధించాలంటే అందులో యువత ప్రధాన భూమిక ఉంటుందన్నారు.