KRNL: ఆదోని – శబరిమల అయ్యప్ప దర్శనానికి పాదయాత్రగా వెళ్లిన 16మంది బృంద సభ్యులు ఇవాళ అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. కాగా గత నెల 17న స్థానిక ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయం నుంచి 16 మంది దీక్ష తీసుకున్న స్వాములు, శ్రీనివాసాచారి ఆధ్వర్యంలో 17వ సారి పాదయాత్రగా శబరిమలకి బయలుదేరారు. రోజుకి 30 కిలోమీటర్లు నడుస్తూ నెల రోజుల్లో శబరిమల చేరుకున్నట్లు తెలిపారు.