VSP: మహిళలు స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలపై పురోగతి సాధించాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ డా. రాయపాటి శైలజ అన్నారు. విశాఖ ‘నారి 2025’ సేఫెస్ట్ కార్యక్రమంలో మంగళవారం ఆమె పాల్గొని మాట్లాడరు. మహిళల విద్య, ఆరోగ్యం, చట్టపరమైన భద్రత అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, శంఖబ్రత బాగ్బీ పాల్గొన్నారు.