MDK: శివంపేట మండలం చిన్న గొట్టిముక్కుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు జీఎంఆర్ సంస్థ తరఫున సౌండ్ సిస్టం బహూకరించారు. జీఎంఆర్ వరలక్ష్మి సంస్థ ప్రతినిధులు శ్రీనివాస్, చరణ్ రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంఈవో బుచ్చా నాయక్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.