MBNR: విద్యార్థులు డ్రగ్స్‌కి దూరంగా ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రెటరీ ఇందిర అన్నారు. మంగళవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. డ్రగ్స్‌కి అలవాటు పడితే జీవితాలు నాశనం అవుతాయని వెల్లడించారు.