ELR: ప్రజలకు జవాబుదారీ పాలన అందించేందుకు అధికారులు పూర్తిస్థాయిలో ప్రజాప్రతినిధులకు సహకారం అందించాలని ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అధ్యక్షతన జరిగిన దిశ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. తాము ప్రజలకు చేయాలనుకునే మంచిని అర్థవంతంగా వారికి చేరువ చేసేందుకు అధికారులు మరింత సమర్థవంతమైన పనితీరు కనపరచాలని ఆదేశించారు.