MHBD: కురవి మండలం రాజోలు గ్రామంలో ఇటీవల మరణించిన మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు తోట రవి చిత్రపటానికి మాజీ మంత్రులు తన్నీరు హరీష్ రావు, సత్యవతి రాథోడ్ పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ మలోత్ కవిత, మాజీ MLAలు డీఎస్ రెడ్యానాయక్, బానోత్ శంకర్ నాయక్, పెద్ది సుదర్శన్ రెడ్డి, MLC రవీందర్ ఉన్నారు.