KDP: పెండ్లిమర్రి మండలంలో ఈనెల 19న జరగనున్న CM చంద్రబాబు పర్యటనకు సంబంధించి జిల్లా SP నచికేతన్ విశ్వనాథ్ ఇవాళ ఏర్పాట్లను పరిశీలించారు. డిగ్రీ కళాశాల ఆవరణలో బందోబస్తుపై ఆయన సూచనలు చేశారు. ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి హెలిపాడ్, సమావేశ స్థలం, రచ్చబండ కార్యక్రమం జరిగే ప్రదేశాలను పరిశీలించి, పర్యటన సజావుగా సాగేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.