HNK: కోట్లాది రూపాయల చిట్టీ మోసం కేసులో నిందితుడై పరారీలో ఉన్న భవితశ్రీ చిట్‌ఫండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్‌ను HNK పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. చిట్టీ సభ్యుల డబ్బు ఎగవేసి మోసం చేసిన ఆరోపణలతో బాధితుల ఫిర్యాదు మేరకు పలు కేసులు నమోదయ్యాయి. రహస్య సమాచారంతో శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.