ADB: బాల్యవివాహాలు చేస్తే కఠిన చర్యలతో పాటు కేసులు నమోదు చేస్తామని ICDS సూపర్వైజర్ మంజుల హెచ్చరించారు. మంగళవారం నేరడిగొండ మండల కేంద్రంలోని కస్తూర్భా గాంధీ బాలికల పాఠశాలలో మహిళా శిశు సంక్షేమ ఆధ్వర్యంలో బాలల హక్కులపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. ఆమె మాట్లాడుతూ.. ఉన్నత విద్యను చదివి మంచి ఉద్యోగాలు సాధించాలని పేర్కొన్నారు.