GDWL: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివే ఎస్సీ విద్యార్థుల నుంచి ఉపకార వేతనాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి నుషిత మంగళవారం పేర్కొన్నారు. కొత్త పథకం కింద 5 నుంచి 8వ తరగతి విద్యార్థులు, రాజీవ్ విద్యా దీవెన పథకం కింద 9,10వ తరగతి విద్యార్థులు డిసెంబర్ 31 లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.