అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన గాజా శాంతి ప్రణాళికకు ఐరాస మండలి ఆమోదం తెలిపింది. మండలిలో జరిగిన ఓటింగ్లో US, UK, ఫ్రాన్స్ సహా 13 దేశాలు మద్దతు తెలిపాయి. వీటో అధికారం ఉన్న రష్యా, చైనా తటస్థంగా నిలిచాయి. మొత్తం 20 అంశాలతో రూపొందించిన ఈ ప్రణాళికలో అంతర్జాతీయ బలగాల వినియోగం, యుద్ధ విరామం, పునర్నిర్మాణం, పాలనకు మార్గదర్శకాలను రూపొందించారు.