ATP: మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 23న రాప్తాడుకు రానున్నారు. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి సోదరుడి కుమార్తె వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించనున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం వైఎస్ జగన్ ప్రోగ్రాం కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, ప్రకాష్‌రెడ్డి.. డీఎస్పీలతో కలిసి వివాహ వేదిక, హెలిప్యాడ్ ప్రాంతాలను పరిశీలించారు.