HYD: సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి ప్రతి సంవత్సరం సుమారుగా 30 శాతం రోగుల సంఖ్య పెరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఒక్కోసారి ఆసుపత్రిలో బెడ్లు దొరకక, ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఫ్లోర్‌పై పడుకోబెట్టి వైద్యం అందించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరోవైపు నర్సింగ్, పారామెడికల్, పేషంట్ కేర్ సెక్యూరిటీ సిబ్బంది సరైన సంఖ్యలో లేక ఇబ్బందులు తప్పడం లేదని రోగులు వాపోతున్నారు.