KMM: అందెశ్రీ పాటలతో ధూంధాం కార్యక్రమం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. విశ్వ కవి అందెశ్రీ సంస్మరణ సభ పోస్టర్ను మంగళవారం ఖమ్మంలో ఆవిష్కరించారు. ఈ నెల 21న సాయంత్రం 5 గంటలకు భక్త రామదాసు కళాక్షేత్రంలో సభ నిర్వహిస్తున్నట్లు నిర్వహణ కమిటీ (చిర్ర రవి, పమ్మి రవి) తెలిపింది. ఈ సభకు ప్రొఫెసర్ కాసిం, విమలక్క వంటి ప్రముఖులు హాజరవుతున్నారని పేర్కొన్నారు.