JGL: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్ రూం పథకం నిరుపేదల సొంతింటి కలను సాకారం చేస్తుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. మంగళవారం పెగడపల్లి మండలం ల్యాగల మర్రిలో ఇందిరమ్మ పథకం ద్వారా మంజూరైన ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసుకున్న కుందేల లక్ష్మి నూతన గృహప్రవేశ కార్యక్రమంలో కలెక్టర్ బీ. సత్యప్రసాద్‌తో కలిసి పాల్గొన్నారు.