KMR: తాడ్వాయి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అడిషనల్ కలెక్టర్ చందర్ నాయక్ మంగళవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై సమీక్ష నిర్వహించారు. మండలంలో ఇళ్ల నిర్మాణం వేగవంతంగా కొనసాగాలని ఆయన ఆదేశించారు. అధికారులు లబ్ధిదారులకు ఈ విషయంపై అవగాహన కల్పించాలని సూచించారు. ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు సకాలంలో బిల్లులను వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.