SKLM: ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ రాయపాటి శైలజ నవంబర్ 19న జిల్లాకు రానున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. బుధవారం ఉదయం 8 గంటలకు విశాఖపట్నంలో బయలు దేరి 10 గంటలకు స్థానిక ఆర్ట్స్ కళాశాల వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆడిటోరియంకు చేరుకుంటారని ఆయన తెలియజేశారు.