సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలకు భారత రత్న, లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పుట్టపర్తికి చేరుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్‌లు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం వారంతా కాసేపు పలు విషయాలపై చర్చించారు. సచిన్ కూడా ఈ వేడుకల్లో పాల్గొనేందుకు రావడంతో భక్తుల్లో ఉత్సాహం పెరిగింది.