AP: నెల్లూరు జిల్లాలో ఓ RTC బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. సంగం హైవేపై వెళ్తున్న బస్సుకు కింద భాగంలో మంటలు వ్యాపించాయి. అటుగా వెళ్తున్న కానిస్టేబుల్ గమనించి వెంటనే బస్సు డ్రైవర్‌కి సమాచారం అందించాడు. దీంతో అప్రమత్తమై వెంటనే బస్సును నిలిపి.. ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించాడు. కాగా బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.