ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా సాగనున్నాయి. పార్టీ గుర్తులు లేకున్నా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మద్దతుదారులు బరిలో ఉన్నారు. మంత్రులు కొండా సురేఖ, సీతక్కతో పాటు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజు, దొంతి మాధవరెడ్డి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, గండ్ర సత్యనారాయణ రావులకు ఈ ఎన్నికలు పరీక్షలుగా మారాయి.