VZM: గజపతినగరంలోని మెంటాడ రోడ్డులో వర్షం పడితే తరచూ నీరు నిలిచిపోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం ఆర్ అండ్ బీ అధికారులు మెంటాడ రోడ్డులో కొలతలు కొలిచి కాలువలు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. రోడ్డు ఆక్రమణలు తొలగించి కాలువలు నిర్మాణం చేపట్టి రోడ్డుపై మీరు నిలువ కుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వారు తెలిపారు.