TPT: శిల్పారామంలో ప్రతివారం నిర్వహించే వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి. తిరుచానూరు శ్రీ పద్మావతి కళాక్షేత్రం డాన్స్ అకాడమీ వారిచే నిర్వహించిన భరతనాట్య ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నారులు మహాగణపతిం, శివతాండవం, భజరేనందగోపాల, బృందావనానికి రారా కృష్ణ, అరుణాచలేశ్వర శివనాట్యం ఆకట్టుకున్నాయి.