VSP: ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణాలు అర్పించిన స్వర్గీయ పొట్టి శ్రీరాములు 73వ వర్ధంతి కార్యక్రమం సోమవారం ఉదయం విశాఖ ఫిషింగ్ హార్బర్లోని బాలవికాస ఫౌండేషన్లో జరిగింది. ఈ సందర్భంగా ఫౌండేషన్ వ్యవస్థాపక కార్యదర్శి నరవ ప్రకాశరావు పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.