జగిత్యాల మండల ఒడ్డెర కాలనీ, అర్బన్ మండలంలోని మోతె, సారంగాపూర్ మండలంలోని లక్ష్మీదేవిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ పాలకవర్గం సభ్యులు సోమవారం జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ను ఆయన క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి శాలువాలు కప్పి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు.