NTR: విజయవాడ సూర్యారావుపేట పీసపాటి వారి వీధిలో ఉన్న కార్యాలయంలోని అధికారులతో డీసీఎంఎస్ ఛైర్మన్ బండి రామకృష్ణ సోమవారం సమావేశమయ్యారు. డీసీఎంఎస్ పరిధిలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు, రైతులకు చౌక ధర దుకాణాల ద్వారా అందిస్తున్న ఎరువుల వివరాలను, డీసిఎంఎస్ పరిధిలో ఉన్న భూములను, గిడ్డంగులను, రావలసిన నిధుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.