బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్‌తో జూ.ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకోనున్నట్లు తెలుస్తోంది. షారుఖ్ ‘పఠాన్’ మూవీ సీక్వెల్లో ఆయన కీలక పాత్రలో కనిపించనున్నాడట. ఇప్పటికే యష్ రాజ్ ఫిల్మ్స్ అధినేత ఆదిత్య చోప్రా NTRను సంప్రదించినట్లు, ఇందుకు NTR రూ.100 కోట్లు డిమాండ్ చేసినట్లు వార్తలొస్తున్నాయి. ‘స్పై యూనివర్స్’లో భాగంగా రాబోతున్న ఈ మూవీ ‘వార్ 2’తో కనెక్ట్ అయి ఉంటుందని టాక్.