తాను పెళ్లి చేసుకున్నట్లు వస్తోన్న వార్తలను నటి మెహరీన్ ఖండించింది. తాను ఓ వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు వార్తలు రాశారని, కానీ అతను ఎవరో కూడా తనకు తెలియదని చెప్పింది. తాను ఎవరినీ పెళ్లి చేసుకోలేదని, ఒకవేళ వివాహం చేసుకుంటే అందరికీ చెబుతానని పేర్కొంది. కాగా, గతంలో హర్యానాకు చెందిన భవ్యా బిష్ణోయ్‌తో మెహరీన్ ఎంగేజ్మెంట్ జరగ్గా.. ఆ పెళ్లి రద్దు అయింది.