AKP: అక్రమంగా తరలిస్తున్న 21 కేజీల గంజాయిని పట్టుకున్నామని గొలుగొండ మండలం కృష్ణదేవిపేట ఎస్సై రుషికేశ్వరరావు తెలిపారు. ముందుగా వచ్చిన సమాచారం మేరకు మంగళవారం ఏఎల్.పురం గ్రామ శివారులో వాహన తనిఖీలు చేస్తుండగా రెండు ద్విచక్ర వాహనాలపై నలుగురు వ్యక్తులు ఈ గంజాయిని తరలిస్తు పట్టుబడ్డారన్నారు. వీరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు.