ASF: కాగజ్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం కళాశాల ఫిజిక్స్ విభాగం ఆధ్వర్యంలో రోబోటిక్స్‌పై ప్రత్యేక వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ సోహమ్ అకాడమీ ప్రతినిధి సంతోష్ హాజరై విద్యార్థులకు రోబోటిక్స్ సాంకెతికతపై ప్రయోగ పూర్వకంగా అవగాహన కల్పించారు. విద్యార్థుల చేత స్వయంగా రోబోటిక్స్‌లోని మౌళికాంశాలపై ప్రయోగాలు చేయించారు.