RR: ఫరూఖ్‌నగర్ మండలం ఉప్పరిగడ్డ గ్రామ సర్పంచ్ చందు నాయక్, ఉపసర్పంచ్ శ్రీలతను తెలంగాణ భవన్లో మాజీ మంత్రి కేటీఆర్ శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజలకోసం కష్టపడి పనిచేయటం అలవాటు చేసుకుంటే భవిష్యత్తులో అపజయం ఉండదని, నిరంతరం ప్రజల్లో ఉండాలని పిలుపునిచ్చారు. ఆదర్శవంతంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.