TG: ఇంటర్ పరీక్షల షెడ్యూల్లో ఇంటర్ బోర్డు స్వల్ప మార్పులు చేసింది. మార్చి 3న జరగాల్సిన ఇంటర్ సెకండియర్ మ్యాథ్స్ 2ఏ, బోటనీ, పొలిటికల్ సైన్స్ పరీక్షలను మార్చి 4న నిర్వహించనున్నట్లు తెలిపింది. మార్చి 3న హోలీ ఉండటంతో పరీక్షల తేదీలో మార్పు చేసినట్లు వెల్లడించింది. మిగతా పరీక్షలు యథాతథంగా నిర్వహించనున్నట్లు పేర్కొంది.