NLR: బోగోలు మండలం కప్పరాళ్ల తిప్ప గ్రామంలో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సహకారంతో నిర్వహించిన టీడీపీ క్రికెట్ టోర్నమెంట్ మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి ప్రారంభించారు. కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యేను పార్టీ నాయకులు, కార్యకర్తలు, క్రికెటర్లు ఘన స్వాగతం పలికారు.