HYD: హుస్సేన్ సాగర్ను శుభ్రం చేసేందుకు హెచ్ఎండీఏ (HMDA) భారీగా రూ.14.03 కోట్లు ఖర్చు చేస్తోంది. మూడు సంవత్సరాల ప్రాజెక్ట్ 3.14 లక్షలకు పైగా ప్రత్యేక ప్లాస్టిక్ సంచుల కొనుగోలుకే రూ.3.9 కోట్లు కేటాయించారు. అత్యధిక నిధులు కూలీలు, ట్రాక్టర్ల ద్వారా చెత్త తరలింపునకే పోతున్నాయి. కాలుష్య మూలాన్ని అరికట్టకుండా, పదేపదే శుభ్రం చేయడానికే కోట్లు వృథా చేస్తున్నారు.