VZM: పట్టణంలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో మహిళల భద్రతపై మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఈ.నర్సింహమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని శక్తి యాప్, రహదారి భద్రత, డిజిటల్ అరెస్ట్ మోసాలపై విద్యార్థినులకు వివరించారు. ఆపద సమయంలో శక్తి యాప్‌లోని SOS బటన్ నొక్కితే పోలీసులకు సమాచారం అందుతుందన్నారు.