TG: మల్కాజ్గిరి వసంతపురి కాలనీలో మోనాలిసా దంపతులు నివాసం ఉంటున్నారు. కొన్నేళ్లుగా మోనాలిసా మానసిక వ్యాధితో బాధపడుతోంది. ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం తన ఏడేళ్ల కూతురు షారోనీ మేరిని మూడంతస్తుల బిల్డింగ్ పైనుంచి విసిరేసింది. ఈ దుర్ఘటనలో చిన్నారికి తీవ్ర గాయాలు కాగా, స్థానికులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు పరిశీలించగా చిన్నారి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు.