అన్నమయ్య: ఇటీవల రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన సుగవాసి ప్రసాద్ బాబును రాజంపేట టీడీపీ అసెంబ్లీ కార్యనిర్వాహక కార్యదర్శి మోదుగుల నరసింహులు గురువారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. నరసింహులు మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడి పనిచేసినందుకు అధిష్టానం గుర్తించి ఈ పదవి ఇవ్వడం సంతోషకరమన్నారు.