MBNR: నవాబ్ పేట మండల పరిధిలోని వెంకటేశ్వర తండా, కొల్లగుంట తండా నూతన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సమక్షంలో లిమ్బ్యానాయక్, రవి నాయక్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర తండాకు రూ.25 లక్షలు, కొల్లగుంట తండాకు రూ.20 లక్షల నిధులు మంజూరు చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.