KNR: చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామ సర్పంచ్ చింతపూల నరేందర్, వార్డు సభ్యులను మంత్రి పొన్నం ప్రభాకర్ తన క్యాంపు కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భవిష్యత్తులో కొత్త మండలాల ఏర్పాటు చేపడితే ఇందుర్తిని మండల కేంద్రం చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే కొహెడ మార్గంలోని వంతెనను త్వరగా పూర్తి చేస్తామన్నారు.