MBNR: పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కాలేజీకి చెందిన విద్యార్థిని పాత్లావత్ పద్మావతి ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ పరేడు ఎంపికయ్యారు. వివిధ దశల స్క్రీనింగ్‌లను ఎదుర్కొని ఎంపిక కావడం పీయూకి గర్వకారణమని, గణతంత్ర వేడుకల్లో తెలంగాణ ఔన్నత్యాన్ని చాటాలని ఉపకులపతి ఆచార్య జి.ఎన్. శ్రీనివాస్ అన్నారు.