TG: GHMC డివిజన్ల పునర్విభజన పిటిషన్లపై హైకోర్టులో విచారణ ముగిసింది. డివిజన్ల వారీగా జనాభా వివరాలు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. 24 గంటల్లో పిటిషనర్లకు వివరాలివ్వాలని పేర్కొంది. వివరాలు ఇచ్చాక రెండ్రోజుల్లోపు పిటిషనర్లు అభ్యంతరాలు తెలిపాలని సూచించింది. అలాగే అభ్యంతరాల గడువు మరో రెండు రోజులు పెంచాలని వెల్లడించింది.