GNTR: తెనాలి గంగానమ్మపేటలోని శ్రీ పర్వత వర్ధిని సమేత రామేశ్వర స్వామి ఆలయంలో బుధవారం హుండీ లెక్కింపు నిర్వహించారు. కార్యనిర్వహాణాధికారిణి రమణ కుమారి, దేవాదాయ శాఖ ఇన్స్‌స్పెక్టర్ వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో ఉదయం 10.00 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు లెక్కింపు జరిగింది. భక్తుల నుంచి కానుకల రూపంలో రూ.4,57,671 ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు.