VSP: రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి, పెద్ద ఎత్తున కుంభకోణాలకు పాల్పడాలని చంద్రబాబు ప్రభుత్వం కుట్ర చేస్తోందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ పూర్తయిందన్నారు.